Posts

Showing posts from August, 2025

దారి దీపాలవుదాం రండీ !

Image
మానవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ (స) ఈ భూమి మీద 63 సంవత్సరాలు జీవించినప్పటికి ఆయన ధర్మ ప్రచారం, ధర్మ స్థాపన ప్రయత్నం 23 సంవత్సరాలు చేసినప్పటికీ ఆయనను గురించి నేటికీ మనం మాట్లాడుకోవడానికి గల కారణాలు గమనింస్తే ఆయన జీవించిన విధానంలోగానీ, క్రియలలోగాని, ప్రవర్తనలోగాని, తలంపులలోగానీ, ఆలోచనలలోగానీ ఏ మచ్చ లేకుండా ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగే దీపమయి వందల కోట్ల దీపాలను ప్రపంచంలో వెలిగించారు. మానవ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో చెరగని ముద్రను వేసినటువంటి మానవ మహోపకారిగా ఘన కీర్తిని గడించారు అన్న విషయం మనందరికీ తెలుసు. మన దైనందిన ధార్మిక జీవితంలో విశ్వాసులుగా మనం దారి దీపాలుగా మార్చబడిన తరువాత అనేకమంది జీవితాలను వెలిగించే వ్యక్తులుగా మన మీద బాధ్యత మరింత పెరిగింది. ధర్మ దారి తెలియని అందరికి కాకపోయిన ఏ కొందరికయినా మనం దారి దీపం అవ్వాలి. మన ప్రాంతంలో, మన ఇరుగుపొరుగులో ధర్మ దీపాలయి ప్రకాశించాలి. మిత్రులారా! ఒక్క క్షణం ఆలోచించండి, మనం అనాథగా ఉన్నప్పుడు అల్లాహ్ మనకు ఆశ్రయం కల్పించలేదా? మనం అవసరంలో ఉన్నపుడు అల్లాహ్ మనల్ని ఆదుకోలేదా? మనం ధర్మ దారి తెలియక మార్గవిహీనులమయి ఉండగా అల్లాహ్ ...